XtGem Forum catalog








విడుదల తేదీ : 5 మార్చి 2015
Tcinema.Net : 3/5
దర్శకుడు : కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత : మల్కాపురం శివ కుమార్
సంగీతం : సత్య మహావీర్
నటీనటులు : నిఖిల్, త్రిదా చౌదరి, మధుబాల…

‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలతో వరుసగా రెండు హిట్స్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ హ్యాట్రిక్ హిట్ అందుకోవడం కోసం చేసిన సినిమా ‘సూర్య vs సూర్య’. ‘పోర్ఫిరియా'(అనగా సూర్యున్ని చూస్తే చనిపోవడం) అనే జబ్బుతో బాధపడుతున్న ఓ కుర్రాడి చుట్టూ అల్లుకున్న ఈ రొమాంటిక్ లవ్ స్టొరీ ద్వారా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్రిదా చౌదరి హీరోయిన్ గా పరిచయం అయిన ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ మధుబాల, సత్య, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషించారు. హ్యాట్రిక్ హిట్ అందుకుంటానని ఎంతో నమ్మకంగా ఉన్న నిఖిల్ నమ్మకాన్ని నిజం చేసి సూర్య vs సూర్య నిఖిల్ కి హ్యాట్రిక్ హిట్ అందించిందా లేక ఊహించని ఫలితాన్ని ఇచ్చిందా అనేది కింద చదివి తెలుసుకోండి.

కథ :
మధుబాలకి పుట్టిన సూర్య(నిఖిల్)కి పుట్టినప్పటి నుంచే కోటి మందిలో ఒకరికి ఉండే ‘పోర్ఫిరియా’ అనే జబ్బు ఉంటుంది. ఈ జబ్బు వల్ల సమస్య ఏమిటంటే సూర్యరక్తంలో ఉండే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ కావడం వల్ల సూర్య కిరణాలు తాకితే ఒక 15 నిమిషాల్లో చనిపోతాడు. అందుకే మధుబాల సూర్యని పగలంతా ఇంట్లో ఉంచి సాయంత్రం సూర్యని బయటకి పంపిస్తుంది. అలా సూర్య నైట్ కాలేజ్ లో చేరతాడు. అక్కడ సూర్యకి అరుణ స్వామి(సత్య), వెర్రిస్వామి(తనికెళ్ళ భరణి)లు ఫ్రెండ్స్ అవుతారు. ఓ రోజు సూర్య సంజన(త్రిదా చౌదరి)ని చూసి ప్రేమలో పడతాడు. మొదట వీరిద్దరి మధ్య పరిచయం, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడం లాంటివి జరిగిపోతాయి.
ఆ సమయంలో సూర్య తనకున్న సమస్య గురించి సంజనకి చెప్పాలనుకుంటాడు. కానీ ఆ విషయం వేరే వాళ్ళ వల్ల తెలియడంతో సంజన సూర్యకి దూరమవుతుంది. సంజన ప్రేమని కోల్పోయిన సూర్య తన ప్రేమని తిరిగి దక్కించుకోవడానికి ఏం చేసాడు.? కేవలం రాత్రిళ్ళు మాత్రమే బయటకి రాగలిగిన సూర్య సంజన కోసం పగటి పూట బయటకి వచ్చాడా.? లేదా.? సూర్య చెప్పాలనుకున్న విషయాన్ని సంజన అర్థం చేసుకొని చివరికి సూర్యని చేరుకుందా.? లేదా.? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ట్రైలర్ చూసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన కాన్సెప్ట్. ‘పోర్ఫిరియా'(అనగా సూర్యున్ని చూస్తే చనిపోవడం) అనే జబ్బు ఉన్న ఓ కుర్రాడి చుట్టూ ఓ అందమైన ప్రేమ కథని అల్లు కోవడం, ఆ ప్రేమకథలోనే ప్రేక్షకులను నవ్వించే కామెడీని ప్లాన్ చేసుకోవడం ఈ సినిమాకి బాగానే హెల్ప్ అయ్యింది. సినిమా స్టార్టింగ్ లో వచ్చే మొదటి 15 నిమిషాలు అందరినీ సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఇక ప్రతి సినిమాలోనూ ఏదో ఒక్క కొత్తదనాన్ని, కొత్త పాత్రని ట్రై చేస్తున్న నిఖిల్ ఈ మూవీలో కూడా ఒక డిఫరెంట్ పాత్రని పోషించాడు. ‘పోర్ఫిరియా’ జబ్బు ఉన్న కుర్రాడిగానే కాకుండా ఒక లవర్ బాయ్ పాత్రలో కూడా మంచి నటనని కనబరిచాడు. లుక్స్ పరంగా స్లిమ్, స్టైలిష్ అండ్ హాన్డ్సం గా కనిపిస్తాడు. ప్రతి సినిమాలో నటుడిగా ఒక్కో కోణాన్ని చూపిస్తున్న నిఖిల్ ఈ సినిమాతో ఒక రొమాంటిక్ హీరోగా మంచి ముద్ర వేసుకుంటాడు. త్రిదా చౌదరికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తెలుగు రాకపోయినా ఈ రొమాంటిక్ లవ్ స్టొరీకి పర్ఫెక్ట్ హావభావాలను ఇచ్చింది. కొన్ని రొమాంటిక్ సీన్స్ లో క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యువతని మెప్పిస్తాయి. నిఖిల్ – త్రిదా కెమిస్ట్రీ చాలా బాగుంది. నిఖిల్ ఫ్రెండ్స్ గా చేసిన సత్య – తనికెళ్ళ భరణిలు సినిమా మొత్తం ట్రావెల్ అవుతూ ప్రేక్షకులని నవ్విస్తారు. ముఖ్యంగా తనికెళ్ళ భరణి డైలాగ్ మాడ్యులేషన్ ఈ సినిమాలో అదిరింది. ఆయన డైలాగ్స్ అన్నీ ఆడియన్స్ ని నవ్విస్తాయి. అలనాటి హీరోయిన్ మధుబాల నిఖిల్ మదర్ పాత్రలో పర్ఫెక్ట్ గా సరిపోయింది.
ఇకపోతే రావు రమేష్, సాయాజీ షిండే, తాగుబోతు రమేష్, వైవా హర్ష, ప్రవీణ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా ఉంటూనే ప్రేక్షకులను నవ్విస్తూ చాలా తొందరగా అయిపోయినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో నిఖిల్ – త్రిదల మధ్య వచ్చే ఫస్ట్ లవ్ డేటింగ్ ఎపిసోడ్, ఇంటర్వల్ ఎపిసోడ్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో నిఖిల్ – సత్య – తనికెళ్ళ భరణిల కామెడీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. నైట్ ఎఫెక్ట్ విజువల్స్ ని అద్భుతంగా చూపించాడు.

మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా కాన్సెప్ట్ ని ట్రైలర్ లోనే రివీల్ చేసెయ్యడం వలన సినిమాకి వచ్చే ప్రేక్షకులు సినిమాపై కాస్త అంచనాలతోనే వస్తారు. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో కాన్సెప్ట్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా వారి అంచనాలను అందుకున్నాడు. కానీ సెకండాఫ్ లో మొదటి 5 నిమిషాల తర్వాత కథా పరంగా చెప్పడానికి ఏమీ లేకపోవడం వలన సినిమాని బాగా సాగాదీసేసాడు. దానివల్ల ఆడియన్స్ బోర్ ఫీలవుతారు. అలాగే సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే ఊహాజనితంగా ముందుకు వెళ్తుంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీ సెకండాఫ్ లో లేకపోవడం మరో చెప్పదగిన మైనస్ పాయింట్.

ఫస్ట్ హాఫ్ లో మంచి రొమాంటిక్ ట్రాక్ ని క్రియేట్ చేసిన కార్తీక్ ఘట్టమనేని సెకండాఫ్ లో ఆ రిలేషన్ ని బ్రేక్ చేయడానికి తనకి ఉన్న జబ్బే కారణం అని తెలియగానే హీరోయిన్ హీరోని వదిలేయడం అనే రీజన్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. అంటే లవ్ బ్రేకింగ్ పాయింట్ అనేది అంత సిల్లీ అయినప్పుడు లవ్ కి వాల్యూ ఏముందనేది నా వాదన. అలాగే క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ అండ రొటీన్ గా ఉంటుంది. ఆ సింపుల్ ఎపిసోడ్ లో కామెడీ ట్రై చెయ్యాలనుకున్నాడు అది సరిగా వర్క్ అవుట్ అవ్వలేదు. ఈ సినిమా ట్రైలర్ వల్ల సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడమే కాకుండా అవి ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయని పలువురు ఆశిస్తారు . కానీ ఇందులో ఆడియన్స్ థ్రిల్ అయ్యే సస్పెన్స్ ఎలిమెంట్స్ లేవు. ఇకా లాజికల్ గా మిస్టేక్స్ చాలానే ఉన్నాయి.. ఒకటే అడుగుతా.. అసలు చిన్నపటినుంచి చదువుకొని సూర్య డైరెక్ట్ గా కాలేజ్ లో ఎలా చేరతాడు.?

సాంకేతిక విభాగం :
‘సూర్య vs సూర్య’ బడ్జెట్ పరంగా మీడియం బడ్జెట్ సినిమా అయినా చూసేటప్పుడు ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ చూస్తున్నాం అనే ఆలోచన రావడానికి కారణం మాత్రం ఈ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీం అని చెప్పాలి. ఇలాంటి కాన్సెప్ట్ కి ముఖ్యంగా కావాల్సింది విజువల్స్. కార్తీక్ ఘట్టమనేని అందించిన విజువల్స్ సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేసిన ప్రతి ఒక్క సీన్ ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి లోనుచేస్తాయి. కార్తీక్ సినిమాటోగ్రఫీనే కాకుండా కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ డిపార్ట్ మెంట్స్ ని కూడా డీల్ చేసాడు. ఒక రొమాంటిక్ లవ్ స్టొరీ కోసం పోర్ఫిరియా అనే పాయింట్ ని తీసుకొని కథని రాసుకున్న విధానం ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా కార్తీక్ ఫస్ట్ హాఫ్ ని చాలా ఆసక్తికరంగా రాసుకున్నాడు, సెకండాఫ్ లో చెప్పడానికి పెద్దగా ఏమీ లేకపోవడం వలన బాగా డ్రాగ్ చేసేసాడు. సెకండాఫ్ మీద దృష్టి పెట్టాల్సింది. ఇక డైరెక్టర్ గా ఫస్ట్ సినిమాతో అందరి చేత మంచి మార్కులు కొట్టేసాడు. కార్తికేయ డైరెక్టర్ చందూ మొండేటి రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి.

సత్య మహావీర్ మ్యూజిక్ చాలా బాగుంది. అంతే కాకుండా కార్తీక్ విజువల్స్ కి సత్య మహావీర్ నేపధ్య సంగీతం ప్రాణం పోసింది. ఇక్కడ చెప్పాలి అంటే సత్య మహావీర్ ఇచ్చిన సాంగ్స్ ని కార్తీక్ తెరపై సూపర్బ్ విజువల్స్ ఇస్తే, కార్తీక్ అదిరిపోయే విజువల్స్ కి సత్య సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎడిటర్ ఈ సినిమా సెకండాఫ్ విషయంలో కాస్త కేర్ తీసుకోవాల్సింది. ఫస్ట్ హాఫ్ ని ఎంతో ఆసక్తిగా కట్ చేసారు, కానీ సెకండాఫ్ మిస్ అయ్యింది. మల్కాపురం శివ కుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆయన పెట్టిన ప్రతి రూపాయి తెరపై అందంగా కనిపిస్తూ ప్రేక్షకులని ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

తీర్పు :

‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద వరుస విజయాలను అందుకున్న యంగ్ హీరో నిఖిల్ మరో సారి కొత్త కాన్సెప్ట్ తో చేసిన ‘సూర్య vs సూర్య’ కూడా ప్రేక్షకులు ఓ సారి చూడదగిన సినిమా. దానికి కారణం మంచి కాన్సెప్ట్ ని అనుకున్న స్థాయిలో తీయలేకపోవడం. కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, కానీ దాన్ని కేవలం ఒక రొమాంటిక్ ట్రాక్ కి మాత్రమే ముడివేయడం వలన ఆధ్యంతం ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు. నటీనటుల పెర్ఫార్మన్స్, ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటే, సెకండాఫ్, క్లైమాక్స్ ఎపిసోడ్ ఆడియన్స్ ని మెప్పించలేకపోవడంతో ఒకసారి మాత్రమే చూడదగిన సినిమాగా మిగిలిపోయింది. ప్రస్తుతం బాక్స్ ఆఫీసు వద్ద సినిమాలు లేకపోవడం, హోళీ సీజన్ మరియు ఎక్కువ థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అవడం వలన మొదటి వారం మంచి కలెక్షన్స్ వస్తాయి.


TeluguWorld.wap.sh:-3/5




Users Online


1806